ఇది నా రెండో చారిత్రక నవల. ఎనిమిదవ శతాబ్దపు సంధికాలం అంతశ్శక్తిని 'సార్థ' నవలా రూపంలో ఆవిష్కరించడానికి ప్రయత్నించాను. 'ఆవరణ'లో 'సార్థ' తర్వాతి కాలం నాటి సత్యాన్ని చిత్రించడానికి పూనుకొన్నాను. భారతదేశ చరిత్రలో ఎంతో క్లిష్టమైన ఈ కాలం గురించి తెలుసుకొనేందుకు విపులసామగ్రి లభిస్తుంది. కాని ఆవరణశక్తి (సత్యాన్ని కప్పిపుచ్చే శక్తి) ఈ సమృద్ధ సామగ్రి కంటె ఎన్నో రెట్లు గొప్పది. 'సార్థ' నవల కాలంనాటి చరిత్ర ఆవరణశక్తికి ఎక్కువగా బలి కాకపోవడం గమనార్హం.

        ఆ కాలపు చరిత్ర గురించి నిర్భయంగా సత్యాన్ని ప్రకటించవచ్చు. కాని 'ఆవరణ' నవల కాలం నాటి చరిత్ర గురించి అలా చెప్పలేం. అడుగడుగునా ఆవరణశక్తిని చీల్చుకొంటూ ముందుకు సాగవలసిన అనివార్య పరిస్థితులు ఎదురవుతాయి. అందువల్ల ఈ నవల స్వరూపం - శిల్పాన్ని దానికి అనుగుణంగా నిర్మించుకోవాల్సి వచ్చింది...

- ఎస్‌.ఎల్‌.భైరప్ప

పేజీలు : 328


Write a review

Note: HTML is not translated!
Bad           Good