ఎస్వీ అనే ఒక మహావృక్షం ఏవిధంగా ఎదిగింది? ఎవరు ఏవిధంగా ప్రోత్సాహం అందించారు? ఎవరి ఆదరణ తనకు ఎలా వున్నది? మరెవరి ప్రోద్బలం తనని ముందుకు నడిపించింది? ఈ క్రమంలో క్రమశిక్షణకు పెట్టింది పేరుగా, అంకితభావానికి మారుపేరుగా, ఎందరి మన్ననల్ని అందుకున్నాడు? ఇంతే కాదు, తనకంటూ ఒక స్థానం లభించిన తర్వాత ఎందరి ఉన్నతి కోసం తనే ఒక పునాదిరాయిగా మారాడు? మరెందరి అభ్యున్నతి కోసం తన స్నేహహస్తాన్ని అందించాడు? వీళ్ళంతా ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు? ఎలా స్పందిస్తున్నారు? మొత్తానికి ఆయనపై వీళ్ళందరి అభిప్రాయం ఏమిటి? ఆశీర్వదిస్తున్నది ఎవరు? ఆశీస్సులు కోరుకుంటున్నది ఎందరు? ఈ మొత్తం విషయ క్రోడీకరణలో పుస్తకం ఒక ''ఎస్వీ జీవన చిత్రపటం''గా రూపుదిద్దుకుంది. ఇందుకు నేను ఎంతో తృప్తి చెందుతున్నాను.

-ఎస్వీ భారతి (కందిమళ్ళ భారతి)

Write a review

Note: HTML is not translated!
Bad           Good