''ఆసరా'' కథల సంపుటిలోని 'అమృతాన్ని సాధించు' కథకి ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఒక అగ్రవర్ణ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఒక అథోజగత్‌ స¬దరుడు. ఏ కుల వ్యవస్థవల్ల అతను తిరస్కారానికి గురయ్యాడో ఆ కులాన్నే పట్టుకు వేళ్లాడుతూ, ఆ యువతి జీవితాన్నీ, తన జీవితాన్నీ దు:ఖభాజనం చేశాడు. ఇదీ ప్రధాన ఇతివృత్తం. 

పీమేల్‌ ఇన్‌ఫాంటిసైడ్‌ ప్రథానాంశంగా కలిగిన కథ ' రేపటి ప్రశ్న'.

'ఆసరా' కథ ఇంటర్నెట్‌ నిర్వాహకులు అమాయక యువతీ యువకుల్ని ఎలా ట్రాప్‌ చేసి, బ్లాక్‌మెయిల్‌ చేసి, వారి మానప్రాణాలతో చెలగాటమాడుతున్నారో చిత్రించారీ కథలో. అలాంటి దారుణాలకు ఆత్మహత్యలే శరణ్యంగా భావించేవారికి 'ఆసరా' ఆవశ్యకతని సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి.

ఇక ఈ సంపుటి మొత్తంలో ఒక అతిగొప్ప కథ వుంది. అది 'సంధ్యారాగం'. హాస్టల్‌ వుండి చదువుకుంటున్న కాలేజీన స్టూడెంట్‌ సావేరి. ఒక దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయింది. ఆత్మహత్యకి పాల్పడింది. ఆ ప్రయత్నంనుంచీ ఆ యువతిని కాపాడి ఆఎమలో అనన్య సామాన్యమైన రీతిలో - తనదైన వాక్‌ చాతుర్యంతో, నిఖార్సయిన 'కన్‌సర్న్‌'తో స్నేహితురాలిలో ఆత్మస్థైర్యాన్నీ, ఆశాశ్వాసనీ ఊదుతుంది - సుమేథ. సావేరి రూంమేట్‌ ఈమె. ఈ సుమేధ పాత్ర పోషణ కథకులకు ఒక 'పెద్దబాలశిక్ష' అంటాన్నేను! అలాగే, రచయిత్రి గడుసుదనం, కథనచాతుర్యం, సావేరికి జరిగిన అసలు దౌష్ట్యం ఏమిటో చెప్పకపోవటంలో వుంది! గొప్ప కథాశిల్ప పరిణతి. అలాగే, సావేరిని సమీర్‌కి దగ్గర చేయటం కథావసరంగా రాణించింది ( ఆ దౌష్ట్యానికి పాల్పడింది ఈ సమీర్‌ కాదు. జాగ్రత్త!). ఈ కథలో మరో ఆకర్షణ సాధారణ పాఠకుడికి అంతగా తెలియని 'హాట్‌ ఎయిర్‌ బెలూనింగ్‌' ప్రయాణం చూపటం! అమెరికాలో ఇతర సాహస క్రీడల్ని ఉటంకించటం కూడా సందర్భోచితంగా ఇమిడిపోయింది.

Pages : 214

Write a review

Note: HTML is not translated!
Bad           Good