కాలేజి జీవితానికీ బయటి ప్రపంచంలో ఎదురయ్యే చేదు అనుభవాలకి లొంగరందరూ . ఆ రోజులే వేరు ! అక్కడ వున్నప్పుడు ఎంత ఉత్సాహం. ఎన్ని ఆశలు ! ఎన్నెన్ని కలలు ! అంటూ ఉస్సూరు మంటుం టాడు రవి . రికమెండేషన్లూ లంచాలు అబద్దాల ప్రపంచంలో అతడు ఇమడలేదు.
రవికి గోపాలానికి స్నేహం ఏర్పడుతుంది . ఇద్దరూ ప్రాణమిత్రులవుతారు
గోపాలం తీరు వేరు . "ప్రతిదాన్ని తర్కంలోకి లాగి, తనకి తానూ సంతృప్తిపడేలా సమాధానం చెప్పుకుంటాడు. అందుకే అతని గుంజాటన ఉండదు. అంతరాత్మ సాదింపులు వేధింపులు ఉండవు. అతడికి పేకాట వ్యసనం మాత్రమే కాదు, రాబడి మార్గం కూడా.
పేకాట అనే శ్రీరామరక్ష వల్లనే నేనూ, నా భార్య, పిల్లలు బ్రతుకుతున్నాం సుఖంగా ఉన్నాం అంటాడు గోపాలం. అయితే ఈ అర్గుమెంట్లో రవి ఏకీభవించడు . మీ ఒక్కడి సఖం వెనుక ఎంతమంది నిట్టూర్పులు , శాపనార్ధాలు దాగి ఉన్నాయో ఆలోచించండి. అని వాదిస్తాడు రవి.
రవి, గోపాలం శాంత, సత్య కుసుమ, వీరందరి అనుభవాలూ ఆశలు సంపుటే ఆశల శిఖరాలు.
ఎన్నోన్నో ఆలోచిస్తాం . ఎన్నెన్నో ఆశిస్తాం !ఏమి జరగదు . జరిగాల్సినవేవో జరుగుతాయి. అయినా సరే, జీవితంలో ఆశల శిఖరాల వైపు అమాయకంగా చూస్తూనే ఉంటాం. దాదాపుగా మన అందరిలో ప్రతి ఒక్కరి జీవితం అంటే ... రవి స్వగతం ఇది. మామూలు మనుషుల ఆశలూ కలల అల్లికే యద్దనపూడి సులోచనారాణి నవల- ఆశలశిఖరాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good