ప్లేబాయ్‌ విక్కీరాయ్‌ చెయ్యని నేరం లేదు. కాని అతనికి శిక్ష పడదు. కారణం అతని తండ్రి హోంమినిస్టర్‌. బార్‌లో అందరిముందరా ఒక అమ్మాయిని కాల్చి చంపుతాడు, ఐనా అతను నిర్ధోషి అని కోర్టు తీర్పునిస్తుంది. దానిని సెలబ్రేట్‌ చేయ్యడం కోసం అతనొక పార్టీ యిస్తే, ఆ పార్టీలోనే అతన్ని ఎవరో హత్య చేస్తారు. అనుమానితులు ఆరుగురు - దయ్యం పట్టిన ఒక ఐపిఎస్‌ అధికారి, ఒక సెక్సీ స్టార్‌, ఒక అండమాన్స్‌ ఆదివాసి, ఒక సెల్‌ఫోన్ల దొంగ, సీఎం అవాలనుకుంటున్న ఒక రాజకీయ నాయకుడు, ఒక అమెరికన్‌ బఫూన్‌ - అందరి దగ్గరా రివాల్వర్లు దొరుకుతాయి, నేరం చేసేందుకు అందరికీ తగిన కారణాలున్నాయి. అయితే హంతకులెవరు?
ఈ సంచలనాత్మకమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. రకరకాల మనస్తత్వాలు, జీవితమూ, జీవింలోని మంచీ, తియ్యదనమూ, చేడూ, హాస్యము - అన్నీ చిత్రించబడ్డాయి. పలురకాలైన పాత్రల అనుభవాలనుంచి మన సమాజంలోని మంచి చెడులను రచయిత విశ్లేషిస్తాడు. మనల్ని ఎక్కడెక్కడికో - ఢిల్లీ, కాశ్మీర్‌, లక్నో, ముంబై, కోల్‌కతా, చెన్నై, కాశీ, జైసల్‌మేర్‌, అండమాన్స్‌ - తీసుకెళ్ళి, ఆయా ప్రాంతాల జీవన విశేషాలను కళ్ళముందు ఉంచుతాడు. మనకు పరిచయం లేని జీవితకోణాలను చూపిస్తూ, విశేషానుభూతిని కలగజేస్తాడు. నవలలోని కొన్ని సంఘటనలు - భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ, అల్‌కైదా, బాంబ్‌ బ్లాస్ట్స్‌, నక్సలైట్‌ ఎన్‌కౌంటర్స్‌, సెక్స్‌ స్కాండల్స్‌ - గతంలో నిజంగా జరిగిన సంఘటనలను గుర్తు చేస్తాయి. సామాజిక న్యాయం ప్రస్ఫూటంగా ప్రతిఫలించిన నవల ఇది. మన సమాజంలో సంపూర్ణమైన మార్పు రావాలని రచయిత ఎంత ఆవేదన చెందకపోతే, 'హత్యలో కూడా కులప్రసక్తి ఉంటుంది...చివరికి హత్య కూడా వ్యసనంగా మారవచ్చు', అని అంటాడు?
అపురూపమైన కథా సంవిధానం...
అద్భుతమైన శిల్పం..
అనూహ్యమైన ముగింపు.
ఇది విశిష్టమైన రచన. ఒక మానవ విజ్ఞానశాస్త్రం. ఒక గొప్ప భారతీయ నవల. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good