నారదునిచేత ప్రేరేపించబడిన వాల్మీకి మహర్షి బ్రహ్మ వర ప్రభావంతో రామాయణాన్ని నూరు కోట్ల శ్లోకాలతో రచించాడు. తొమ్మిది లక్షల కాండలు, తొంభై లక్షల సర్గలతో కూడిన రామాయణాన్ని విని దేవతలు, మానవులు, పాతాళవాసులు రామాయణం మాకే కావాలని వాదించుచుండగా విష్ణువు నూరు కోట్ల శ్లోకాలను మూడు భాగాలుగా చేసి దేవ, మానవ, పాతాళ లోకాలకు ఇచ్చాడు. మానవలోకానికి వచ్చిన భాగాన్ని మరల సప్తద్వీపాలకు పంచాడు. జంబూద్వీపమునకు వచ్చిన భాగాన్ని మరల తొమ్మిది దేశములకు పంచగా భారతదేశానికి యాభై రెండు లక్షల శ్లోకాల రామాయణం వచ్చింది. రాబోయే ద్వాపర యుగంలో వ్యాసుడు భారతభాగానికి వచ్చిన రామాయణ భాగాన్నుంచి పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉప పురణాలు వ్రాస్తాడని, ఋషులు ధర్మశాస్త్రాలు వ్రాస్తారని తద్వారా రామాయణ గ్రంథం జీర్ణమయిపోయి ఏడు కాండలతో ఇరవై నాలుగువేల శ్లోకాలు మాత్రమే మిగులుతాయని దివ్య దృష్టితో చూసి, రామాయణంలోని ఆనందకరమైన భాగాన్ని నాశనంకానీయ వద్దని రాముణ్ణి వేడగా, శ్రీ రాముడు తన భక్తుడైన రామదాసు (శివాజీ గురువు) కు పూజానంతరం దర్శనమిచ్చి, నూరు క్లో శ్లోకాలలో వాల్మీకి వ్రాసిన ఆనందమయిన భాగాన్ని దివ్యవ దృష్టితో గ్రహించి సూక్ష్మంగా తన శిష్యులకు చెప్పవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా రామదాసు తన శిష్యుడైన విష్ణుదాసుకు పన్నెండువేల శ్లోకాలతో ఆనందమయిన రాముని గాధను సంక్షేపముగా వివరించాడు అదే ఆనన్ద రామాయణము.
పేజీలు : 552