కాలం కిరణాల ఉలి చేతబట్ట
ఎన్నెన్ని శిల్పాలు చెక్కిందో మా నరసింహ కొండమీద
పెన్నేటి ధారగా ప్రవహించిన పద్యం
ఎన్ని యమాతారాజ భానసలగాలని అల్లిందో సింహపురి గడ్డమీద
కవుల కాణాచి నా నెల్లూరు నెరజాణ
కవి తిక్కన తాంబూలమిచ్చిన సాహితీ వీణ
వేదాల నుండి వాదాల వరకు కవుల్ని పండించిన మాగాణం
తెలుగు నుడికారానికి తెరచాపనెత్తిన విన్నాణం
అరువది నాలుగు కళలను ఆరుగాలం పోషించిన రమణి
అక్షరాల మొలగొలకుల్ని సాలంకారంగా పండించిన నదీ మాతృక
స్వాతంత్య్ర సమరవీరుల గరిమ తారులుగా తలదాల్చిన నేల
దాతల తలకోతల తలచాటున పెరిగిన పైడికొమ్మ
ఎందరెందరో మహానుభావుల తలసాలగ రాజిల్లిన రత్న సానువు
పుణ్య చరితుల పరిచయ భాగ్యమొసగి నను కన్న నాతల్లి నెల్లూరు సీమ!

Write a review

Note: HTML is not translated!
Bad           Good