శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటె గొప్పది. ఆ నగరంలోని మేడలు నక్షత్ర లోకాన్ని ముద్దు పెట్టుకుంటున్నంత ఎత్తుగా వుండేవి. ఆ మేడలు పసిమిరంగులో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. ఆ నగరంలోని ఉద్యానవనాలు అన్ని రకాల పూలమొక్కలతోను, సువాసనలు వెదజల్లుతూండేవి. అక్కడక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా వుండేవి. ఆ వనాలలో రకరకాల పక్షులు కిలకిలమంటూ గానం చేస్తుండేవి. విలుబుత్తూరు వీధులు ఎక్కడా వంకరు లేకుండా తిన్నగా తీర్చిదిద్దినట్లుండేవి. రెండువైపులా ఇళ్ళు, మిద్దెలు, మేడలు. ఆ ఇళ్ళు దృఢమైన మకర స్తంబాలతో, పెద్ద పెద్ద తామరపూవుల ఆకారంలో మలచిన స్తంబాల కొనలతో అందంగా కనిపించేవి. ఆ ఇళ్ళ ద్వారాలు శిల్ప కఝళలతో ముచ్చటగా వుండేవి. ఇళ్ళచుట్టూ వుండే ఆవరణలలో కొబ్బరిచెట్లు పెద్ద పెద్ద బొండాలతో సగర్వంగా నిలచి వుండేవి. వాకిళ్ళకిరువైపులా కొబ్బరి చెట్లతోపాటు అరటిచెట్లు కూడా శ్రద్ధగా తీర్చిన ముగ్గుల్లాగా అందాన్ని చేకూర్చేవి......

ఆ నగర స్త్రీలు ఉద్యానవనాల్లోని కొలనులకు వెళ్ళి, తలార స్నానం చేసి పసుపు పూసుకుని, చంకల్లో నీళ్ళబిందెలు పెట్టుకొని, ఆ బిందెలతో పోటీ పడుతున్నట్లు పలుచని గౌనుల్ని తోసుకువచ్చే చన్నులతో, పగడపురంగు పాగాలతో, ఉద్యానవనాల త్రోవలవెంట నడుస్తుంటే పద్మినీజాతి స్త్రీలలా కనిపించేవారు.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good