ఉత్తమ కథాశిల్పికి ఉండాల్సిన అన్వేషణ, అనుశీలన, అవగాహన, కల్పన, రచనాశిల్పం, మనో విశ్లేషణ వంటివన్నీ మన రచయిత్రిలో ఉన్నట్లు తెలుస్తుంది ఈ రచనల వల్ల. కాపా లక్ష్మి విదుషి. ఆంగ్లసాహిత్యంలో మాస్టర్ డిగ్రీని పొంది ఉన్నారు. సాంస్కృతిక రంగంలో అనుభవం గడించిన వనిత. చాలా చాలా విషయాలతో పరిచయం ఉన్న మహిళ. కథా రచన, నవలారచన చేయటానికి విద్య మాత్రమే చాలదు, లోకానుభవం, కళ్ళు మూసుకొనే చూడగల ప్రతిభ మొదలైనవి అవసరం. లక్ష్మిలో అటువంటివన్నీ ఉండబట్టే ఇటువంటి మంచి రచనలను వ్రాయటం కుదిరింది.

ఈ పుస్తకం ఒక ఇంద్రధనుస్సు. వివిధ వర్ణశోభ పాఠకులకు దర్శనమిస్తుంది ఇందులో.
- సంజీవదేవ్

Write a review

Note: HTML is not translated!
Bad           Good