ఈ ప్రచురణ సాధారణ స్ధాయికి చెందినదైనప్పటికీ, అలంకార శాస్త్రాన్ని అన్ని కోణాలనుంచి పరిశీలించిన మన ప్రాచీనుల ఘనవారసత్వ ప్రతిభను దిగ్మాత్రంగా చూపడానికి ప్రయత్నిస్తుంది.

విశ్వమంతట నుంచి వారసత్వంగా మనకు లభిస్తున్న కవితా వాజ్మయంలో భరతుని సిద్ధాంత ప్రకటన బహుశా అత్యంత సమగ్రమైనది. మానవునిలో సహజ స్వాభావికమైన స్పందించే గుణం, నాటకీయ సమర్పణలో వివిధమైన ప్రేరకాల కూర్పు ద్వారా దాన్ని క్రియాత్మకం చేయడం, దాని వల్ల ప్రేక్షకునిలో వచ్చే ప్రతిస్పందన, చివరికి స్వచ్ఛమైన రసానుభూతిగా అది నిగ్గుదేలడం - ఆ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు. శబ్దార్ధాల నిగూఢమైన కలయికలోని అంతరార్థాన్ని అన్వేషించాడు భామహుడు. ఈ పుస్తకం, చదవి ప్రేరణ పొందిన పాఠకులకు ఇంకా లోతుగా అధ్యయనం చేయాలనే ఆకాంక్షను కలిగిస్తుందని ఆశిస్తున్నాము. - కృష్ణచైతన్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good