గిరిజన జీవన విధానం ఇంతకు ముందు పూర్తి ప్రత్యేకతను సంతరించుకుంటే, ఈ మధ్యన బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగిన తరువాత మార్పులు త్వరితంగా వస్తున్నాయి. కొన్ని మంచిని కలిగించే మార్పులయితే, మరికొన్ని సమాజాన్ని, వ్యక్తుల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మార్పులు. భారత రాజ్యాంగం, ప్రత్యేక చట్టాలు గిరిజనులకు అన్ని విధాలైన రక్షణలు కల్పిస్తూ, వారు హుందాంగా బతికేలా చేసి, బయటి ప్రాంతాలతో వారు నివసించే ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెయ్యాలని చెబుతుంటే, అందుకు విరుద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు గిరిజనుల మౌలిక అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగ కనిపిస్తున్నాయి. ఈ మధ్యన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలు ముమ్మరం కావటంతో గిరిజన ప్రాంతాలలోని సహజ వనరులపై దాడి ఎక్కువ అవుతోంది. గిరిజనులు నిరాశ్రయులు అవుతున్నారు. సరళీకరణ అనంతర గిరిజనుల జీవన విధానాలకు అద్దంపడుతుంది ఈ పుస్తకం.

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good