అనంత వైజ్ఞానిక ప్రపంచంలో అనునిత్యం వివిధ శాస్త్రాలలో ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతూన్నాయి. కొత్తగా కనుగొన్న విషయాలు డిగ్రీస్థాయి; పి.జి. స్థాయి పాఠ్యంశాలు'గా చోటు చేసుకోవడం లేదు. కొన్ని అంశాలు.... ఉదాహరణకు 'బయోటెక్నాలజీ' వంటివి పైస్థాయి పాఠ్యగ్రంథాలకు ఎక్కుతూన్నా, అవి ఇతర వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉండడంతో అవన్నీ విద్యార్థులకు చేరుతూన్నాయా? అనేది తేలని ప్రశ్న.

ఇలా నూతన ఆవిష్కరణలు పైస్థాయిలో కొంతవరకు స్థానం సంపాయించడంతో, ఇంతకాలంగా డిగ్రీస్థాయి బోధనాంశాలుగా ఉన్న కొన్ని పాఠాలు ఇంటర్మీడియెట్‌లోనికీ - ఇంటర్ పాఠాలు టెన్‌తు క్లాసులోనికీ బదిలీ అవుతూన్నాయి. ఎనిమిది - తొమ్మిది - పది తరగతుల విద్యార్థులకు ఇవి అదనపు భారంగా పరిణమిస్తున్నాయి. కానీ, తప్పనిసరి పరిస్థితి ఇది. ఎందుకంటే - ఈ పోటీ ప్రపంచంలో 'సైన్స్‌లో కరెంట్ అఫైర్స్' సమాచార పత్రికల ద్వారా అందుబాటులోకి వస్తూండడంతో విద్యార్థికి అవి తెలుసుకోక తప్పని పరిస్థితి ఎదురవుతూన్నది. ఈ నేపథ్యంలో హైస్కూలు, కాలేజీ విద్యార్థులకు మరియు అన్నిరకాల పోటీ పరీక్షలు వ్రాసే వారికి సైన్స్కు సంబంధించి ఆధునిక సమాచారం అందించాలన్న చిరుసంకల్పమే ఈ పుస్తకానికి ప్రేరణ.
- పబ్లిషర్స్

Write a review

Note: HTML is not translated!
Bad           Good