సోవియట్‌ యూనియన్‌ - కమ్యూనిస్టు పార్టీ, తన కాలంలో, ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన అత్యద్భుతమైన పుస్తకాల్లో ఈ ''ఆధునిక చరిత్ర'' కూడా ఒకటి.

చరిత్ర పుస్తకాల్లో వేరే వాటిని రెండు డజన్ల పుస్తకాలు చదివినా తెలుసుకోలేని విషయాలు ఈ ఒక్క పుస్తకంలో తెలుసుకుంటాం. ఈ పుస్తకం ప్రత్యేక ఏమిటంటే, మానవులందరూ ఒకే రకపు సముదాయం కాదని దీనికి తెలుసు. ఆ వేరు రకాల మానవులు, ఒకరికి ఒకరు శతృ వర్గాలవుతారని - ఈ పుస్తకానికి తెలుసు. పేదలు ఎవరో, రాజులు ఎవరో; యుద్ధాలు ఎవరు చేయిస్తారో, ఎందుకు చేయిస్తారో, అన్నీ తెలుసు దీనికి.

యుద్ధాలు! యుద్ధాలు! యుద్ధాలు! ఈ పుస్తకం నిండా యుద్ధాలే, పోరాటాలే! వర్గ దృష్టితో గ్రహించిన చరిత్రనే చెపుతుంది, ఈ పుస్తకం. అందుకే ఈ పుస్తకం, ఇతర రకాల చరిత్ర పుస్తకాల నించి భిన్నమైనది.

ఈ ''ఆధునిక చరిత్ర''లో, భూస్వామ్య వర్గం మీద, పెట్టుబడిదారీ వర్గం పోరాడే చరిత్రలనే ప్రతీ దేశంలోనూ చూస్తాం. ఆ పోరాటాల వల్ల కలిగే ఫలితాలు, శ్రామిక ప్రజలకు కూడా కొంత మేలు చేసేవిగా వుండే ఫలితాలే. అందుకే శ్రామిక ప్రజలు కూడా ఆ పోరాటాల్లో కలుస్తారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good