1951లో 'దీక్ష'లో మొదటి పాట రాసినప్పటి నుంచీ 1989 వరకు ఆత్రేయ జీవితం ఒక నిరంతర స్రోతస్విని.  38 సంవత్సరాలు తెలుగు జన జీవనంతో మమేకమయి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.  అదొక మహాప్రస్థానం.  ఆత్రేయ కోసం తహతహలాడే ప్రొడ్యూసర్లు, ఆయన డిక్టేట్‌ చేస్తే వ్రాయడానికి సిద్ధంగా వున్న అసిస్టెంటు డైరెక్టర్లు, ఒక్క అక్షరం రాసినా నెత్తిమీద పెట్టుకుని మురిసిపోయే అభిమానులు, ఆయనకి డబ్బు యిచ్చినందుకే గర్వంగా చెప్పుకునే నిర్మాతలు, రాయని అతని బద్ధకాన్ని, రాశాక ఆ రచనలో ఘనతిని కథలుగా చెప్పుకొనే అభిమానులు, ఆయన ఆక్రమశిక్షణకి తలవొంచే వ్యాపారులు, ఆయన బద్ధకాన్ని కొత్త ఆలోచనకు అన్వేషణకు సమర్థించుకొనే హంగుదారులు, కావాలంటే మీదపడే డబ్బు, రాయకపోయినా ఎప్పటికయినా రాస్తాడని సరిపెట్టుకునే దర్శకులు, మాట నిలబెట్టుకోని దాట వేత ఒక మేధావి స్వభావంగా సరిపెట్టుకునేవారు, ఆయన రాసిదే వేదమని నమ్మేవారు, పాటలో ఆత్రేయ ముద్రకి వెదికేవాళ్లు, ఆయన్ని పరోక్షంగా తిట్టి పాటకి పట్టం గట్టేవాళ్లు, కొట్టేవాళ్లు, అడుగులకు మడుగులొత్తవాళ్లు - అదొక ముమ్మరం.
ఆత్రేయ చెప్పిందే వేదమయింది.  అది వేదం అయితేగాని ఆత్రేయ చెప్పేవాడు కాదు.  ప్రజలనాడిని ఆపోశన పట్టిన అద్భుతమయిన దశ అది.  కవులు ఈర్ష్యపడేంత గంభీరమైన జీవనాన్ని గడిపి, సాహితీ లోకం గర్వపడేంత ఆర్థ్రమైన రచనలందజేసి, చరిత్రలో తనదైన స్థానాన్ని మిగుల్చుకుని సెలవు తీసుకున్న ఆచార్య ఆత్రేయ తన చరమగీతాన్ని తానే రాసుకున్నాడు.
''చలన చిత్ర నిర్మాతలు సంతసిల్ల
సురకవి వరుండిది విని యచ్చెరువు పొంద
గురువు మల్లాది, శ్రీశ్రీయు సరస నుండ
తరలె నాత్రేయ పరమపదమ్ము చేర!''

Write a review

Note: HTML is not translated!
Bad           Good