ఇందులో ఏముంది?
ఇది కథామృతం కాదు, నవలామృతం అంతకంటే కాదు. ఒక న్యాయవాది, న్యాయవాద వృత్తిలో వుంటూనే, సమాజ సేవా దృక్పథంతో గుంటూరు జిల్లా స్థాయిలోనే గాకుండా, రాష్ట్రస్థాయిలో శాంతి-స్నేహ సంఘాలతో పాటు ప్రజాస్వామ్య న్యాయవాదుల సంఘ రాష్ట్ర బాధ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో పర్యటించి పై సంఘాల కార్యకలాపాల బాధ్యతలు నిర్వహించి, మన రాష్ట్రంలోనే గాకుండా, దాదాపు అన్ని రాష్ట్రాలలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సభలలో, సమావేశాలలో పాల్గొన్నారు. అంతేగాకుండా సోవియట్ యూనియన్, తూర్పు జర్మనీ, గ్రీస్, పోలాండ్, జకొస్లోవేకియాలలో పర్యటించారు. అనేకమంది జాతీయ, అంతర్జాతీయ నాయకులతోను, అనేకమంది హైకోర్టు, సుప్రీమ్ కోర్యుట న్యాయమూర్తులతోను సహచర్యం ఉన్నవారు. అంతేగాకుండా అంతర్జాతీయ అంశాలపై వివిధ పత్రికలకు వ్యాసాలు అందిచడమేగాక, ఐ.ఎ.ఎస్. వగైరా పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు బోధించడమేగాక, వారి కొరకై అనేక పుస్తకాలు రాసి ప్రచురించి అందజేసిన వారి అనుభవాలు, జ్ఞాపకాలు సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని అందజేస్తున్న చిన్న పొత్తం ఇది.
పేజీలు : 160