555 రకాల శాకాహార, మాంసాహార సురుచి వంటలు.
ఇంకా కూరలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు, స్వీట్స్‌, హాట్స్‌, కూల్‌డ్రింక్స్‌, సూప్స్‌, సలాడ్స్‌, యిలా ఎన్నో వంటలు గురించిన గ్రంథం యిది.
ఇంచుమించు ఆంధ్రులు, కొందరాంద్రేతరులు నిత్య జీవితంలో ఉపయోగించే వంటలన్నింటినీ ఒక గ్రంథంలోకి తేవాలని గడచిన మూడు సంవత్సరాల మా కృషి యిప్పటికి ఫలించినది.
అనేక మంది చేతులు యిందులో ఉన్నవి. ఇంకా అనేక మంది పాకశాస్త్ర ప్రవీణులు వీటిని పరీక్షించడం జరిగింది. పుస్తకం వ్రాయడం కంటే వీటిని అనుభవజ్ఞులు పరిశీలించడానికే యింత కాలం పట్టినది.
తెలుగులో యింత సమగ్రమైన పుస్తకం యిదే. ఇన్ని రకాల వంటలున్న పుస్తకం కూడా యిదే.
శాకాహార, మాంసాహారులకిది ఎంతో ఉపయోగకరమైనది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good