విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, క్విజ్‌లలో పాల్గొనేవారికి, విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంచుకోగోరువారికి ఉపకరించే పుస్తకం '450 విచిత్ర ప్రశ్నలు? జవాబులు''.
కూరగాయలు, పండ్లకు తేడా ఏమి?
కప్పలు చెట్టెక్కుతాయా?
చెదలు అంటే ఏమిటి?
గుండె ఎలా పని చేస్తుంది?
కొందరికి రంగులు కనిపించవట ఎందుకు?
దేశాలకు వాటి పేర్లు ఎలా వస్తాయి?
కాగితం ఎలా తయారు చేస్తారు?
విమానాన్ని ఎవరు కనుగొన్నారు?
గెరిల్లా అంటే ఎవరు?
'చదరంగం' ఎవరు కనుగొన్నారు?
ఇలాంటి ఆసక్తికర, విచిత్ర ప్రశ్నలకు వెంటనే జవాబులు చెప్పడం విద్యార్ధులకైనా, ఉపాధ్యాయులకైనా, మేధావులకైనా కష్టమే.
సరిగ్గా అలాంటి అవసరాన్ని తీర్చడానికే ఈ పుస్తకంలో జీవశాస్త్రం, భూగోళ, భౌతిక, ఖగోళ శాస్త్రాలు, సైన్స్ & టెక్నాలజీ, వైద్యం-శరీరం, చరిత్ర, జనరల్ నాలెడ్జిలలో 450 ప్రశ్నలు & జవాబులు యిచ్చాం.
ఈ పుస్తకం పిల్లల్లో,పెద్దల్లో వివేకాన్ని, విజ్ఞానాన్ని పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. జ్ఞాన సంపదను పెంచుకోగోరువారందరూ తప్పక చదవాల్సిన పుస్తకమిది.