అక్షరం బలి కోరుతుంది అని ఉత్తరాలు రాసుకొనే కాలంలో పెద్లఉ చెప్పేవారు. అది నిజం చేసే సంఘటన రైనా జీవితంలో జరిగింది. అమాయకురాలైన ఆమెని పరిస్థితులు దోషిని చేసి ఒన్‌-వే-స్ట్రీట్‌లోకి నెట్టాయి. ఆమె పిరికిది కాదు. ధైర్యం చెదరలేదు. పరిస్థితులతో పోరాడి రైనా పట్టుదలగా మొదటి అడుగు గమ్యం వైపు వేసింది.

ఆ తరువాత?

అనేక స్వీడ్‌ బ్రేకర్స్‌ని ఆ ఒన్‌-వే-స్ట్రీట్‌లో రైనా ఎలా ఎదుర్కొంది?

క్రైమ్‌ని రాయడంలో అందెవేసిన మల్లాది వెంకటకృష్ణమూర్తి కలం నించి వెలువడ్డ తాజా డైరెక్ట్‌ నవల 24 గంటల్లో... ఇది మిమ్మల్ని ఊపిరి బిగబట్టి ఉత్కంఠగా చదివిస్తూ మద్య ఆపనివ్వదు.

ఎర్ర పెట్టె అనే క్రైమ్‌ నవల కూడా ఈ పుస్తకంలో ఉంది.

పేజీలు : 196

Write a review

Note: HTML is not translated!
Bad           Good