బలం, బలగం వంటివేమీలేని బాధితులకు న్యాయం చెయ్యటంలో కోర్టులు విఫలమవుతుండటమన్నది మన దేశంలో కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ సమస్యేమంటే దిల్లీ, గుజరాత్‌లలో జరిగిన జాతి హననకాండల్లో బాధితులైన వారికి న్యాయం చేయటంలో - ఒక్క కోర్టులేకాదు - రకరకాల విచారణ కమీషన్లు, అధికార యంత్రాంగం, దర్యాప్తు సంస్థలు, ప్రత్యేక దర్యాప్తు బృందాల వంటివన్నీ కూడా విఫలమైపోయాయి. ఇలా దేశంలో ఉ్న అజమాయిషీ, దిద్దుబాటు వ్యవస్థలన్నీ కూడా విఫలమైపోవటమంటే - రాజకీయ నాయకత్వానికి తామేం చేసినా తప్పించుకు తిరగొచ్చన్న ధీమా కల్పించడటమే! ఈ వ్యవస్తల వైఫల్యమే ఈ ప్రజాస్వామ్య దేశంలో జాతి హననాలు మళ్లీమళ్లీ చోటు చేసుకునేలా చేస్తోంది. మళ్లీ మళ్ళీ మారణకాండలకు ఆస్కారమిస్తోంది. మన పౌర సమాజం ఈ వ్యవస్థాపరమైన లోపాల్ని గుర్తించి - ఈ అవ్యవస్థల్నీ, అస్తవ్యస్థాల్నీ సరిదిద్దు కోవటం చాలా అవసరం. అందుకే వీటన్నింటినీ అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ, లోపాలన్నింటినీ లోతుగా తరచి చూశారు మనోజ్‌ మిట్ట, హెచ్‌.ఎస్‌.పుల్కా, ఒక్క దిల్లీ, గుజరాత్‌లే కాదు దేశంలో ఎక్కడ 'న్యాయం' జరగాలన్నా ఈ పుస్తకాన్ని చదవటం చాలా అవసరం.

స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ ప్రమేయంతో జరిగిన ఒక గగుర్పొడిచే మారణ¬మం గురించిన వాస్తవాలను ఈ పుస్తక రచయితలు ఎంతో శ్రమించి సమగ్రంగా ఆవిష్కరించారు. తమ రాజకీయ యజమానుల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పోషించిన అభిశంసనీయమైన పాత్రను తూర్పారబట్టి ఎంతో సార్వజనిక సేవచేశారు.

- లలిత పణికర్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good