హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మనిద్దరం బలవంతంగా తోయబడ్డాం. ఒకరికొకరు ఏమీ కాకుండా .... కేవలం భార్యాభర్తలమయి.... ఇలా అసంతృప్తితో వేగిపోతున్న ఆమె - భర్తని ఒక అర్ధరాత్రి హోటల్‌ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్ళి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది. పురుషుడికొక న్యాయం స్త్రీకో న్యాయం ఎందునుకుంది.

అదొక తాత్కాలికమైన అసంకల్పిత ప్రతీకార చర్య, పర్యవసానం ? బ్లాక్‌ మెయిలింగ్‌, మానసిక సంఘర్షణ, ఊపిరి సలుపనివ్వని క్లైమాక్స్‌.

నకిలీ హిప్నటిజాల మాఫియా, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల మోసాల నేపధ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపార వేత్త, భారతదేశపు నెంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయరు ఒకరు -

నాలుగువిభిన్న మనస్తత్వాలతో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ఆడుకున్న గేమ్‌ '13-14-15'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good