ప్రయోగాలు వస్తు నిర్మాణ కౌశల్యాన్ని పెంచుతాయి!

    సాంకేతిక చాతుర్యత కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అవకాశాలు చిక్కితే ఆ దిశలో కృషి చేసి తమలోని ప్రతిభకు జీవం పోసుకోగలుగుతారు. ప్రయోగాలు స్వతంత్రంగా చేసే అనుభవం ఇటువంటి వారు పొందితే తప్పక కొత్త కొత్త ప్రయోగాలు రూపకల్పన చేయగలుగుతారు.

    ప్రమాదరహితం, క్షేమదాయకమైన ప్రయోగాలు పిల్లలు అయిదవ తరగతి స్థాయి నుండి చేసేందుకు వారికి కొత్త మార్గదర్శకత్వం అవసరం. ప్రతి ఒక్కరిలోను కుతూహలం ఉంటుంది. నిజానికి ఈ కుతూహలమే జ్ఞానానికి తొలిమెట్టు. ఒక ప్రయోగం విజయవంతంగా చేసేసరికి మరొక ప్రయోగం చేయాలని మనసు ఉవ్విళ్లూరుతుంది.

    నేను అనేక సైన్సు ఎగ్జిబిషన్స్‌ రాష్ట్రవ్యాప్తంగా స్వతంత్రంగా నిర్వహించాను. సైన్సు పరికరాల రూపకల్పన చేసేవారికి ప్రోత్సాహం లభించాలి. నా ప్రయత్నంలో ఒక ఉపాధ్యాయుడు లివరు ఏర్పాటు చేసిన గునపాన్ని తయారు చేసాడు. గునపం మొన మీద కొబ్బరికాయ పెట్టి గృహిణి లివరు కిందకి లాగితే కొబ్బరికాయ ఒలవబడుతుంది. ఇదొక అద్బుతమైన రూపకల్పనగా నాకు అనిపించింది.

    తెలుగునాట ఎందరో మేధావులు ఉన్నారు. మానవ వనరులు కావలసినన్ని. ప్రపంచ మేధావుల సరసన పలువురు తెలుగువారు ధీటుగా నిలబడగలరని నా ప్రగాఢ విశ్వాసం. సైన్సు రంగంలో విజయాలు సాధించాలంటే విద్యార్థి దశ నుండి పాఠ్యపుస్తకాలలో కనిపించే సైన్సు సూత్రాలను వస్తురూపంలోకి మలచగల కౌశల్యం అవసరం. అటువంటి శక్తి విద్యార్థులకు చిన్నతనం నుండి అలవడాలని ఈ '101 సైన్సు ప్రయోగాలు' పుస్తకం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. - సి.వి.సర్వేశ్వర శర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good