నవరత్న ప్రచురణ సంస్ధ ద్వారా మరోసారి మీ ఆదరణకు నోచుకున్న భాగ్యానికి చాల ఆనందిస్తున్నాను! "1001 జోక్స్ ...... జోక్స్ ..... జోక్స్" పుస్తకానికి మీ నుంచి లభించిన విశేషాదరణకు కృతఙ్ఞతలు. మళ్ళి మీ కోసం వినోదంలో విజ్ఞానాన్ని కలగలిపి "1001 ప్రపంచ వింతలు - విచిత్రాలు" అనే ఈ పుస్తకాన్ని రాసాను !
'వింత' అంటే నమ్మశక్యంగాని నిజం ! సైన్సుకు, రీజనింగ్కు కుడా అందని విశేషం. ఈ సువిశాల ప్రపంచంలో మనం ఊహించని విధంగా అనేక "వింతలూ విచిత్రాలు" సంభవిస్తుంటాయి. మనిషి కడుపున వానరం జన్మిస్తే అదొక వింత! చింత చెట్టుకు మామిడికాయలు కాస్తే అదీ వింతే !! ఇంకా.... వినాయకుడి విగ్రహాలు పాలను సేవించినా, సాగర కన్యలు సముద్రాలలో కనిపించినా, అంతరిక్షంలో ఫైవ్ స్టార్  హోటల్ ను నిర్మించడానికి మనోళ్ళు ప్రయత్నిస్తున్నా అవన్నీ విచిత్రాలే! అయితే వీటిని మాత్రం 'వింత'లని భావిస్తే నాకు కొంత అసంతృప్తి కలుగుతోంది. వింత అనే మాటలు చాల విశేషాలకు అనవచ్చునని నా అభిప్రాయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good